గిద్దలూరు: రాచర్ల మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులి మృతి, ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు
మార్కాపురం జిల్లా రాచర్ల మండలం నల్లమల్ల అటవీ ప్రాంతంలో శుక్రవారం పెద్దపులి మృతి చెందిన సంఘటన వెలుగు చూసింది. శనివారం పులి మృతి పై ఆందోళన వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఎస్పీ ఆదేశాలతో గిద్దలూరు రూరల్ సీఐ రామకోటయ్య తన సిబ్బందితో కలిసి అటవీ ప్రాంతంలో పులి మృతి పై విచారణ చేపట్టారు. అటవీ శాఖ అధికారులకు సపోర్టుగా నిలబడి కేసుని త్వరగా పూర్తిచేయాలని ఉన్నత అధికారులు ఇచ్చిన ఆదేశాలతో తాము కూడా విచారణ చేపడుతున్నట్లు సీఐ తెలిపారు. ఇప్పటికే వేటగాళ్ల దగ్గర నుంచి కొన్ని వేటకు సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.