కనిగిరి: బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ సమక్షంలో బీసీవై పార్టీలో చేరిన సమాజ్వాది పార్టీ కనిగిరి ఇంచార్జ్ నజీర్
కనిగిరి నియోజకవర్గ సమాజ్వాది పార్టీ ఇన్చార్జి షేక్ నజీర్ భాష శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఒంగోలుకు వచ్చిన బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ సమక్షంలో నజీర్ భాష బీసీవై పార్టీలో చేరారు. బీసీవై పార్టీలో చేరిన నజీర్ భాషకు పార్టీ కండువాను కప్పి బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కనిగిరి నియోజకవర్గంలో ప్రజల సమస్యలపై బీసీవై పార్టీ తరఫున పోరాటం చేస్తామని నజీర్ భాష ఈ సందర్భంగా తెలిపారు.