రాప్తాడు: వెంకటాపురం గ్రామ సమీపంలో ఉపాధి హామీ పథకాన్ని పరిశీలించి కూలీల హాజరు శాతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పరిటాల సునీత
సత్య సాయి జిల్లా రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో సోమవారం 9:30 గంటల సమయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత వెంకటాపురం గ్రామ సమీపంలో ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న ప్రాంతాన్ని సందర్శించి కూలీల హాజరు శాతాన్ని తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని పరిశీలించడం జరిగిందని అక్కడున్న కూలీలు పలు సమస్యలు తన దృష్టికి తీసుకురావడం జరిగిందని కూలీ చేసిన ప్రతి లబ్ధిదారునికి నగదును వారి ఖాతాలోకే పెండింగ్ లేకుండా జమ చేయాలని అధికారులను కోరడం జరిగిందని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.