కనిగిరి: చంద్రశేఖరపురం మండలం పెదగోగులపల్లి లో వ్యక్తి దారుణ హత్య
చంద్రశేఖరపురం మండలంలోని పెద్దగోగులపల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన ఓ హత్య తీవ్ర కలకలం రేపింది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదగోగులపల్లి కి చెందిన మాజీ సర్పంచ్ మరియు వెంకటేశ్వర్లు కుమారుడు బాబును అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.