ఉరవకొండ: విద్యార్థులను ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు :మండల విద్యాశాఖ అధికారులు గోవిందరాజులు, హరికృష్ణలు
విద్యార్థులను ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలకు తప్పకుండా చేరుకుంటారని మండల విద్యాశాఖ అధికారులు గోవిందరాజులు, హరికృష్ణలు పేర్కొన్నారు. బుధవారం అనంతపురం జిల్లా బెళుగుప్ప మండల కేంద్రంలోని సన్ రైజర్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో కరస్పాండెంట్ మారెన్న అధ్యక్షతన "కిడ్స్ కాన్వకేషన్ ట్రెడిషన్ "కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల డైరెక్టర్ల నాగభూషణ చిన్నతిప్పయ్య, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సిరిపురం నాగరాజు, కరస్పాండెంట్ తో కలసి ఎంఈఓలు పాల్గొని సర్టిఫికెట్స్, మెడల్స్ లను అందజేశారు.