ఉరవకొండ: కౌకుంట్లలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పిజిఆర్ఎస్ అర్జీల స్వీకరణ
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామంలో సోమవారం ప్రజల నుండి పిజిఆర్ఎస్ అర్జీలను స్వీకరించిన మంత్రి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం అని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పేర్కొన్నారు. నలుమూలల నుంచి వచ్చిన బాధితులు, నాయకులు, ప్రజల సమస్యలను అర్జీల రూపంలో స్వీకరించడం జరిగిందని, ఎలాంటి ఆలస్యం కాకుండా ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.