కనిగిరి: పట్టణంలో వైభవంగా హనుమాన్ శోభాయాత్ర
కనిగిరి పట్టణంలో హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమం ఆదివారం వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నుండి హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమం ప్రారంభమైంది. పట్టణంలోని ప్రధాన వీధుల్లో యువకులు బైకులపై ర్యాలీ నిర్వహిస్తూ శోభాయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు శోభాయాత్రకు భారీ బందోబస్తు ఏర్పాట్లను చేశారు.