రాప్తాడు: అనంతపురంలో రాప్తాడు అభివృద్ధి గురించి రూపొందించిన స్వర్ణ రాప్తాడు న్యూస్ బుక్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాప్ కార్యాలయంలో శనివారం రెండు గంటల పది నిమిషాల సమయం లో రాప్తాడు నియోజకవర్గం అభివృద్ధి గురించి రూపొందించిన స్వర్ణ రాప్తాడు న్యూస్ బుక్ లెట్ ను ఎమ్మెల్యే పరిటాల సునీత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ న్యూస్ లెటర్ రాప్తాడు బృందం సిద్ధం చేసిన స్వర్ణ రాప్తాడు లో నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలు భాగస్వామతో జరుగుతున్న ప్రగతి గురించి ప్రతిబింబించేలా రూపొందించడం జరిగిందని ఈ బుక్ లెటర్ ను ప్రజల్లోకి కూడా తీసుకువెళ్లాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.