కనిగిరి: గొల్లపల్లి చెరువు సమీపంలో రోడ్డు ప్రమాదం, గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే మృతి
కనిగిరి మండలం గొల్లపల్లి చెరువు సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వెలిగండ్ల మండలం మొగులూరు నుండి కనిగిరి కి బైక్ పై వస్తున్న ఆంజనేయులును గొల్లపల్లి చెరువు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆంజనేయులు బైక్ పై నుండి కింద పడడంతో ఆయనకు తీవ్ర గాయాలు. అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.