కొండపి: సింగరాయకొండ మండలం పాకాల బీచ్ కు పర్యటకుల తాకిడి, సముద్రం లోపలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న అధికారులు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల బీచ్ కు ఆదివారం పర్యటకుల తాకిడి నెలకొంది. ఉదయం 8 గంటల నుంచి పర్యటకులు సముద్ర ప్రాంతానికి తరలివచ్చి సేద తీరుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో అందులో ఏకాదశి కావడంతో పర్యటకుల తాకిడి మరింత అధికంగా ఉందని స్థానిక అధికారులకు గుర్తించారు. సముద్రం లోపలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా మెరైన్ పోలీసులు తెలిపారు. గతంలో జరిగిన దుర్ఘటనలను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్త పడుతున్నట్లు అధికారులు అన్నారు.