సంతనూతలపాడు: సీఎం చంద్రబాబు కృషి ఫలితంగానే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయి: సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్
సంతనూతలపాడు: సీఎం చంద్రబాబు జన్మదిన కార్యక్రమాన్ని సంతనూతలపాడు లోని టిడిపి కార్యాలయంలో సంతనూతలపాడు శాసనసభ్యులు బి ఎన్ విజయ్ కుమార్ సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు జన్మదిన కేకును కట్ చేసి, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎమ్మెల్యే విజయకుమార్ స్వీట్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అన్ని విధాల అభివృద్ధి చెందుతుందన్నారు. చంద్రబాబు కృషి ఫలితంగానే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని, చంద్రబాబు దర్శని కత కలిగిన నాయకుడని ఎమ్మెల్యే అన్నారు.