కనిగిరి: చంద్రశేఖరపురం నూతన ఎస్సైగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్ రెడ్డి
చంద్రశేఖరపురం నూతన ఎస్సైగా పి వెంకటేశ్వర రెడ్డి సోమవారం చంద్రశేఖరపురం పోలీస్ స్టేషన్ నందు ఉద్యోగ బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది నూతన ఎస్సై వెంకటేశ్వర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. అనంతరం ఎస్సై వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ... చంద్రశేఖరపురం మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా కోడిపందాలు, పేకాట శిబిరాలు వంటి అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి వివరాలు తెలపాలని, అట్టివారిపట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.