కనిగిరి: పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి పల్లకి సేవోత్సవం
కనిగిరి పట్టణంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారి పల్లకి సేవోత్సవ కార్యక్రమాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో శనివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని భక్తులు స్వామివారి పల్లకి సేవోత్సవ కార్యక్రమంలో పాల్గొని, స్వామివారి పల్లకిని స్వయంగా మోసి, కొబ్బరికాయలు కొట్టి, హారతులు పట్టి, పూజలు చేశారు. భక్తులకు ఆశీర్వచనాలను అందజేసిన పండితులు స్వామివారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.