రాప్తాడు: కక్కలపల్లి వద్ద మామిడికాయల మార్కెట్ ను సందర్శించి మామిడి పంట ధరలను అడిగి తెలుసుకున్న రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోనే కక్కలపల్లి మామిడికాయల మార్కెట్ను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత బుధవారం 11:30 నుంచి 1:30 వరకు పరిశీలించి మామిడిపండు ధరలు ఏ విధంగా ఉన్నాయని రైతులను వ్యాపారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ మామిడి పంట పండించే రైతులకు సాధారణంగా 47 వేల రూపాయలు ధర పలుకుతుందని అదే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని పండించే మామిడి పంటకు 80 వేల రూపాయలు టన్ను ధర పలుకుతుందని ఇది శుభ పరిణామం అని భవిష్యత్తులో మామిడి పండించే రైతులకు తమ వంతు సహకారాన్ని కూడా అందిస్తామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.