కనిగిరి: పామూరు పట్టణంలో కలెక్టర్ విజయ సునీత ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజా సదస్సు, ఏర్పాట్లను పరిశీలించిన తహసిల్దార్ లక్ష్మీనారాయణ
పామూరు పట్టణంలో శనివారం మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రజా సదస్సు కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో సదస్సు ఏర్పాట్లను పామూరు తహసిల్దార్ లక్ష్మీనారాయణ, ఏఎంసీ చైర్మన్ రమా శ్రీనివాస్ గురువారం పరిశీలించారు. కనిగిరి నియోజకవర్గంలోని కనిగిరి, పామూరు, వెలిగండ్ల, చంద్రశేఖరపురం, హనుమంతునిపాడు, పెద్ద చెర్లోపల్లి మండలాలకు చెందిన వారు తమ భూ సమస్యలను కలెక్టర్ కు అర్జీల రూపంలో సమర్పించి పరిష్కరించుకోవచ్చని తహసిల్దార్ సూచించారు. కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పాల్గొంటారని తెలిపారు.