ఉరవకొండ: కూడేరు మండలంలోని అరవకురు వద్ద బొలెరో వాహనాన్ని ఢీకొన్న ద్విచక్ర వాహనం రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు సజీవ దహనం
అనంతపురం జిల్లా కూడేరు మండల పరిధిలోని అరవకూరు గ్రామ చెరువు క్రాస్ వద్ద బళ్ళారి- అనంతపురం ప్రధాన రహదారిపై శనివారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో బొలెరో వాహనాన్ని ఢీకొన్న ద్విచక్ర వాహనం ప్రమాదంలో వజ్రకరూరు మండలం పందికుంట గ్రామానికి చెందిన యువకుడు అజిత్ కుమార్, మరియు మరొక యువకుడైన ఆకాష్ ఇద్దరు కూడా అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. ద్విచక్ర వాహనాన్ని బొలెరో వాహనం ఢీకొనడంతో పెట్రోల్ ట్యాంక్ పగిలి మంటలు చెలరేగి పెను ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు, పోలీసులు పేర్కొన్నారు. బొలెరో వాహన డ్రైవర్ గోపాల్ మరో ఇద్దరూ గాయాలతో బయటపడ్డారు. ఘటనపై కూడేరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.