కనిగిరి: వెలిగలలోని ఎంపీడీవో, తహసిల్దార్ కార్యాలయంలో మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతి చోటు చేసుకుందని స్థానికుల ఆరోపణ
వెలిగండ్ల లో తహసిల్దార్ మరియు ఎంపీడీవో కార్యాలయాల్లో నూతనంగా మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.6 లక్షల రూపాయల నిధులను మంజూరు చేసింది. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో మరుగుదొడ్లను నిర్మించారు. అయితే పనులు చేసిన కాంట్రాక్టర్ కొత్తగా మరుగుదొడ్లకు సెప్టిక్ ట్యాంకులను నిర్మించవలసి ఉన్నప్పటికీ, అలా చేయకుండా పాత సెప్టిక్ ట్యాంకులకే పైప్ లైన్ల ద్వారా కనెక్షన్ ఇచ్చారని, సెప్టిక్ ట్యాంకులు నిర్మించకుండా అవినీతికి పాల్పడ్డాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి నూతన సెప్టిక్ ట్యాంకుల నిర్మాణం చేపట్టి, అవినీతిని అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.