కనిగిరి: పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యం: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి
కనిగిరి పట్టణంలోని కొత్తూరులో పీఎం ఏవై పథకం ద్వారా నిర్మించిన గృహాలకు సంబంధించి గృహప్రవేశాల కార్యక్రమాన్ని కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంటు టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గృహాల యజమానులకు ఇంటి తాళాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ... ఇల్లు లేని పేదలకు కూటమి ప్రభుత్వం పీఎం ఏవై పథకం ద్వారా గృహాలను నిర్మించి ఇచ్చిందన్నారు. పేదల సొంతింటి కలను నిజం చేయడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ మరియు మున్సిపల్ శాఖ అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు