ఉరవకొండ: ఏసిఎల్పి కార్యచరణ ప్రణాళికని సిద్ధం చేయాలని డిఆర్డిఏ ద్వారా అందించే జీవనోపాదులను సద్వినియోగం చేసుకుని ఎదగాలన్న కలెక్టర్
ఏసిఎల్పి కార్యచరణ ప్రణాళికని సిద్ధం చేయాలని, డిఆర్డీఏ ద్వారా అందించే జీవనోపాధులను సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ ఎంటర్ప్రెన్యూర్ గా ఎదగాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పిలుపునిచ్చారు. శుక్రవారం అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలోని కాలువపల్లి గ్రామంలో ఉన్న రైతు సేవ కేంద్రంలో 2026-27వ సంవత్సరానికి సంబంధించి ఏసిఎల్పి (యాన్యువల్ క్రెడిట్ లైవ్లీవుడ్ ప్లాన్) కార్యచరణ ప్రణాళికపై సంబంధిత వివోఏలు, ఈనారీలతో, ఎస్.హెచ్.జి మెంబర్లతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి, ఇంటరాక్ట్ అయ్యారు. ఇందులో భాగంగా వివోఏలు, ఈనారీలతో, ఎస్.హెచ్.జి మెంబర్ల జీవనోపాదులపై ఆరా తీసి చర్చించారు.