గిద్దలూరు: కంభం మండలంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న నాయకులు
మార్కాపురం జిల్లా కంభం మండలం లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని సోమవారం స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకుని తర్వాత స్థానిక సమస్యలపై వారితో మాట్లాడారు. సూపర్ సిక్స్ పథకాలు ప్రస్తుతం అమలవుతున్న తీరును వారికి వివరించారు. ఎవరికైనా పథకాలు అందకపోతే ఎందుకు వారికి రాలేదో అడిగి తెలుసుకుని వారికి పథకాలు వచ్చేలా చేస్తామని వారు అన్నారు. అతి త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికలలో కూటమి ప్రభుత్వం మెరుగైన ఫలితాలు సాధిస్తుందని అన్నారు.