ఉరవకొండ: గడేకల్లు -కడదరబెంచి గ్రామాల మధ్య ప్రధాన రహదారి పక్కన నిలబడి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ డ్రైవర్ పరిస్థితి విషమం
అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలోని గడేకల్లు కడదరబెంచి గ్రామాల మధ్య ప్రధాన రహదారిలో సోమవారం రహదారి పక్కన ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. రెండు లారీలు ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో వేగంగా వచ్చిన లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలతో పరిస్థితి విషమంగా మారింది. సీరియస్ గా ఉన్న గాయపడిన లారీ డ్రైవర్ ని గుంతకల్లు హాస్పిటల్ కి తరలించి చికిత్సలు అందిస్తున్నారు.