ఉరవకొండ: కొనకొండ్ల గ్రామంలో మలేరియా వ్యతిరేక మాస ఉత్సవ ర్యాలీ కార్యక్రమం
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని కొనకొండ్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు వైద్యాధికారి ఎర్రిస్వామి రెడ్డి సమక్షంలో వైద్య ఆరోగ్య సిబ్బందితో మలేరియా వ్యతిరేక మాస ఉత్సవాల ర్యాలీ మరియు అవగాహన సమావేశంను గురువారం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి కీటక జనత వ్యాధులు రాకుండా ప్రజలు తీసుకోవాల్సిన నివారణ చర్యలు గురించి అవగాహన కల్పించారు మలేరియా వ్యాధి రాకుండా గ్రామ ప్రజలు దోమతెరలు వాడాలని, పరిసరాల పరిశుభ్రత, డ్రైడే పాటించాలని, ఇళ్ల వద్ద మొరుగు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు పాటించాలని అవగాహన కల్పించారు.