కనిగిరి: వి బి జి, రాంజీ కార్యక్రమం ద్వారా రహదారుల నిర్మాణం: కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి: వి బి జి -రామ్ జి పథకం ద్వారా రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తుందని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. లింగారెడ్డి పల్లి లో వి బి జి-రాంజీ పథకం గురువారం ప్రారంభించిన సందర్భంగా ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడారు. గతంలో ఉపాధి హామీ పథకం ద్వారా చిల్ల చెట్లు కొట్టుకోవడం, నీటి కుంటలు తీసుకోవడం వంటి పనులు జరిగేవని, ప్రస్తుతం వి బి జి-రామ్ జి ద్వారా గ్రామీణ ప్రాంతాలలో రహదారుల నిర్మాణం కూడా చేపట్టవచ్చు అని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ విజయ సునీత, అధికారులు పాల్గొన్నారు.