సంతనూతలపాడు: చీమకుర్తి మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధి ముసాయిదా సిద్ధం, అభ్యంతరాలు ఉంటే నెల రోజుల్లోపు తెలపాలన్న మున్సిపల్ అధికారులు
చీమకుర్తి మున్సిపాలిటీకి సంబంధించిన జిఐఎస్ ముసాయిదాను ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సిద్ధం చేసిందని చీమకుర్తి మున్సిపల్ కమిషనర్ వై రామకృష్ణ ఆదివారం తెలిపారు. మున్సిపల్ అభివృద్ధి కోసం సమగ్ర మాస్టర్ ప్లాన్ రోడ్ల వెడల్పు, అభివృద్ధితో ఈ ప్లాన్ రూపొందించడం జరిగిందన్నారు. సమగ్రాభివృద్ధి ముసాయిదా జాబితాను చీమకుర్తిలోని తహసిల్దార్, మున్సిపల్, మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు. ముసాయిదాపై అభ్యంతరాలు ఉన్నవారు నెల రోజుల్లోపు మున్సిపల్ కార్యాలయంలో తెలపాలని కమిషనర్ సూచించారు.