కనిగిరి: నాదపరెడ్డిపల్లిలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రంలో ప్రీ స్కూల్ సంసిద్ధతపై అవగాహన
కనిగిరి మండలం నారపరెడ్డిపల్లి అంగనవాడీ కేంద్రంలో బుధవారం ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రీ-స్కూల్ సంసిద్ధత కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ICDS సూపర్వైజర్ MVS పార్వతి మాట్లాడుతూ.... 3-6 సంవత్సరాల పిల్లలలో సామాజిక, భావోద్వేగ, శారీరక, అభిజ్ఞా నైపుణ్యాల అభివృద్ధికి ఈ దశ కీలకమని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు కథలు, చిత్రలేఖనం, ఆటపాటల ద్వారా ప్రీ స్కూల్ విద్యా బోధన కొనసాగుతుందన్నారు. అంగన్వాడి కేంద్రాలలో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడం జరుగుతుందన్నారు. తల్లులు పిల్లలను అంగనవాడీకి పంపాలని సూచించారు.