కనిగిరి: ఆత్మహత్యాయత్నానికి పాల్పడి కనిగిరిలో చికిత్స పొందుతున్న ప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీమంత్రి ఆదిమూలపు సురేష్
కనిగిరి పట్టణంలో మాజీమంత్రి, వైసిపి కొండేపి నియోజకవర్గ ఇన్చార్జి ఆదిమూలపు సురేష్ శుక్రవారం పర్యటించారు. మర్రిపూడి మండలం నరసాపురానికి చెందిన బోనం ప్రసాద్ రెండు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడి కనిగిరిలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సురేష్ ... కనిగిరిలోని వైద్యశాలకు చేరుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ప్రసాద్ మరియు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆత్మహత్యాయత్నానికి దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రసాద్ కు మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్యులకు మాజీ మంత్రి సురేష్ సూచించారు.