కనిగిరి: ప్రతి ఒక్కరూ సోలార్ విద్యుత్తును వినియోగించుకొని లబ్ధి పొందాలి: మల్లంపేటలో కనిగిరి శాసనసభ్యులు నరసింహారెడ్డి
కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి: దొనకొండ మండలం మల్లంపేట లో PM సూర్య ఘర్ పథకం కింద SC, ST కాలనీల సౌరీకరణ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తో కలిసి సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ... ఎస్సీ ఎస్టీ కాలనీలకు ప్రభుత్వం సౌర విద్యుతీ కరణ కార్యక్రమంలో భాగంగా సబ్సిడీతో సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రతి ఒక్కరూ తమ నివాసాల్లో సోలార్ విద్యుత్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవాలన్నారు.