ఉరవకొండ: హావలిగి గ్రామంలో దోమల నివారణకు క్రిమిసంహారక మందుల పిచికారి
అనంతపురం జిల్లా విడపనకల్లు మండలoలోని హావలిగి గ్రామo లో సోమవారం వైద్యాధికారి శివ శంకర్ నాయక్, ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి సమక్షంలో మలేరియా వ్యాప్తి చెందే కీలక ప్రాంతాలను గుర్తించి క్రిమిసంహారకమందుతో పిచికారి చేయించడం జరిగింది. మలేరియా వ్యాప్తి చెందే దోమలు మురికి నీటి కుంటలు పాత టైర్లు, బండ రోళ్లు, ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు వంటి వాటిలో నీరు నిలువ లేకుండా చూసుకోవాలని అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. మలేరియా లేని గ్రామం కోసం ప్రతి ఒక్కరూ పట్టుదలగా కృషిచేసి పరిసరాల పరిశుభ్రత తో పాటు వ్యక్తిగత శుభ్రత పాటించాలని పేర్కొన్నారు.