గూడూర్: నర్సంపేట వద్ద రోడ్డు ప్రమాదం: ఎద్దును ఢీకొట్టిన కారు, ఒకరు మృతి
నర్సంపేట శివారు రాజుపేట వద్ద 365వ జాతీయ రహదారిపై మేడారం వెళ్తున్న కారు ఎద్దును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గూడూరు మండలం బొద్దుగొండకు చెందిన ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.