కనిగిరి: పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలను పరిశీలించిన మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత
కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలను మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత స్థానిక శాసనసభ్యులు డాక్టర్ ఉగ్ర నరసింహ రెడ్డితో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యశాలలో నూతనంగా ఏర్పాటుచేసిన మదర్ కేర్ యూనిట్ ను కలెక్టర్ పరిశీలించి అక్కడ ఏర్పాటుచేసిన సదుపాయాలపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి కలెక్టర్ తో మాట్లాడుతూ... మదర్ కేర్ యూనిట్ ను దాతల సహకారంతో నిర్మించినట్లు తెలిపారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు కలెక్టర్ సూచించారు.