కనిగిరి: గౌతువారిపల్లి రైల్వే స్టేషన్ ను అధికారులతో కలిసి పరిశీలించిన కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి మండలంలోని గౌతువారి పల్లి రైల్వే స్టేషన్ ను శుక్రవారం కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గౌతువారి పల్లి రైల్వే స్టేషన్ విషయంలో సాంకేతికపరంగా కొన్ని సమస్యలు ఉండడంతో రైల్వే శాఖ అధికారులతో మాట్లాడి రైల్వే స్టేషన్ ను ఎర్ర ఓబనపల్లి రైల్వే స్టేషన్ గా మార్చేందుకు రైల్వే శాఖ కు ప్రతిపాదనలు పంపామన్నారు. తన ప్రతిపాదన పట్ల రైల్వే శాఖ సానుకూల స్పందన వ్యక్తం చేసిందన్నారు. రైలు ఎక్కాలన్న కనిగిరి ప్రాంత ప్రజల చిరకాల కోరిక త్వరలోనే నెరవేరుతుందని అన్నారు.