జడ్చర్ల: పరిహారం అడిగినందుకు రైతు చొక్కా పట్టుకుని ఈడ్చిన ఎస్ఐ
జడ్చర్ల మండలం ఉదండాపూర్ రిజర్వాయర్ భూ పరిహారం కోసం వెళ్లిన రైతు నరసింహులుపై ఎస్ఐ మల్లేష్ దురుసుగా ప్రవర్తించారు. తన చొక్కా పట్టుకుని ఎస్ఐ ఈడ్చుకెళ్లారని రైతు ఆరోపించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.