జడ్చర్ల: నిధులు మంజూరు చేయకుంటే ఆమరణ దీక్ష: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన హెచ్చరిక
జడ్చర్లలో రోడ్ల నిర్మాణానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి డిమాండ్ చేశారు. నిధులు మంజూరు కాకపోతే 30 వేల మందితో ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని, ప్రాణాలకైనా సిద్ధమని ఆయన హెచ్చరించారు.