కనిగిరి: అర్హత గల ప్రతి ఒకరికి ఓటు ఓటర్ల జాబితాలో నమోదు కావాలి: పెద్ద చెర్లోపల్లి తహసిల్దార్ ఉష
పెద్ద చెర్లోపల్లి: ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని పెద్ద చెర్లోపల్లి తహసిల్దార్ ఉష బుధవారం పరిశీలించారు. మండలంలోని మురుగమ్మి, నేరేడుపల్లి, వెంగలాయపల్లి గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం పై బిఎల్వోలతో తహసిల్దార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... అర్హత గల ప్రతి ఒక్కరికి ఓటర్ జాబితాలో పేర్లు నమోదయ్యే విధంగా బిఎల్వోలు చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్లకు ఎన్రోల్మెంట్ ఫారాలు అందజేసి, వాటిని పూర్తి చేసి, ఆన్లైన్ లో నమోదు చేయాలన్నారు.