సంతనూతలపాడు: దళితుల మీద దౌర్జన్యాలు చేసినందుకే వైసీపీకి 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారు: సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్
సంతనూతలపాడు: దళితులపై గత వైసిపి ప్రభుత్వం లో దౌర్జన్యాలకు పాల్పడినందు వల్లే వారికి 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారని సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం సంతనూతలపాడు లో ఆయన మాట్లాడుతూ.... తెలుగు ప్రజలు ముఖ్యంగా బడుగు ,బలహీనవర్గాల ఆత్మగౌరవం కోసమే తెలుగుదేశం పార్టీ పుట్టిందన్నారు. దళితులైన డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం తదితరులను వైసిపి వేధించి , వారి మరణానికి కారణమైందన్నారు. దళితులను వైసిపి కేవలం ఓటు బ్యాంకు గానే చూస్తుందని, దళితులపై దౌర్జన్యాలకు పాల్పడితే సీఎం చంద్రబాబు, తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.