రాయదుర్గం: తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలు: రాయదుర్గం CDPO లక్ష్మీ ప్రసన్న
తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తున్నామని ఐసిడిఎస్ రాయదుర్గం ప్రాజెక్టు సిడిపిఓ లక్ష్మీ ప్రసన్న తెలిపారు. "తల్లి పాలు ఇచ్చే సంస్కృతిని ప్రోత్సహిద్దాం" అనే నినాదంతో ఆగస్టు 1 నుండి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్నామన్నారు. పుట్టిన గంటలోపు తల్లి పాలు ఇవ్వడం వల్ల కలిగే లాభాలపై ప్రచారం చేస్తున్నామని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పిల్లల ఎత్తు, బరువు నమోదు చేసి, ఎదుగుదల తక్కువగా ఉన్న పిల్లలను గుర్తించి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తామన్నారు. అవసరమైన వారిని ఎన్‌ఆర్‌సీకి సిఫార్సు చేస్తామని వెల్లడించారు.