ఉరవకొండ: మరుట్ల గ్రామ రైతులు విద్యుత్ సమస్యపై సబ్ స్టేషన్ వద్ద ఆందోళన
అనంతపురం జిల్లా కూడేరు మండలం మరుట్ల గ్రామ రైతులు విద్యుత్ సమస్యపై శనివారం ఆందోళనకు దిగారు. నెల రోజులుగా త్రీఫేజ్ విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ మరుట్ల రెండో కాలనీ సబ్‌స్టేషన్ వద్ద రైతులు నిరసన చేపట్టారు. విద్యుత్ అధికారుల తీరుపై రైతులు వంటవార్పు చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సమస్యలు లేకుండా సక్రమంగా పంపిణీ చేస్తామని అధికారులు రైతులకు వివరణ ఇచ్చారు.