కనిగిరి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టిడిపి శ్రేణులు పని చేయాలి : కనిగిరిలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి సుధ
కనిగిరి పట్టణంలో బుధవారం నిర్వహించిన టిడిపి మహానాడు కార్యక్రమాన్ని టిడిపి రాష్ట్ర కార్యదర్శి సుధ ప్రారంభించారు. ఈ సందర్భంగా టిడిపి జెండాను నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి ఆమె ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే బడుగు, బలహీనవర్గాలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు దక్కాయని సుధ తెలిపారు. టిడిపిలో కష్టపడి పనిచేసే ప్రతీ కార్యకర్తకు, నాయకుడికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టిడిపి శ్రేణులు పనిచేయాలని సూచించారు.