కనిగిరి: పామూరు పట్టణంలో వైభవంగా శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవం
పామూరు పట్టణంలో కొలువైన శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని భక్తులు పవిత్ర గంగా జలాలతో శ్రీ పోలేరమ్మ తల్లిని అభిషేకించారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో పొంగళ్ళు పెట్టి భక్తిశ్రద్ధలతో మహా నైవేద్యంగా శ్రీ పోలేరమ్మ తల్లికి సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. భక్తులకు ఆశీర్వచనాలను అందజేసిన పండితులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా పామూరు పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది.