ఉరవకొండ: నియోజకవర్గ వ్యాప్తంగా వైయస్సార్సీపి శ్రేణుల ఆధ్వర్యంలో యువనేత ప్రణయ్ రెడ్డి జన్మదినవేడుకలు
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం వ్యాప్తంగా ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి తనయుడు వైయస్సార్సీపి విద్యార్థి విభాగం రాష్ట్ర జోనల్ ఇంచార్జ్ వై ప్రణయ్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను బుధవారం పార్టీ శ్రేణులు నిర్వహించారు. ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా పలు గ్రామాలు మరియు మండల కేంద్రాలలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో కేకులను కతరించి పలు సేవా కార్యక్రమాలను నిర్వహించి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.