ఉరవకొండ: పట్టణ సమీపంలో రాయంపల్లి దారిలో ప్రయాణికులతో వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ సమీపంలో రాయంపల్లి దారి నుండి దర్గాహోన్నూర్ కు సుమారు 30 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు బుధవారం తెల్లవారుజామున తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణీకులతో దర్గాహోన్నూరుకు వెళుతున్న బస్సుకు ఓట్రాక్టర్ అడ్డు రావడంతో తప్పించబోయి రోడ్డుపక్కకు దూసుకెళ్లి ఒరిగిందని ప్రయాణికులు పేర్కొంటున్నారు. బస్సు చక్రం పూర్తిగా బురదలో ఇరుక్కుపోవడంతో బస్సు వైపుకు ఒరగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. వెను వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు బస్సు నుండి అందరూ సురక్షితంగా దిగి ట్రాక్టర్ అడ్డు వచ్చినా డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించారన్నారు.