కనిగిరి: ఓటర్ల డిజిటలైజేషన్ ప్రక్రియను బిఎల్వోలు త్వరితగతిన పూర్తి చేయాలి: కనిగిరి మున్సిపల్ కమిషనర్ శ్రీధర్
కనిగిరి పట్టణంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా బూత్ లెవెల్ అధికారులు చేపడుతున్న డిజిటలైజేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కనిగిరి మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ ఆదేశించారు. సోమవారం పట్టణంలోని పాతూరు, కోట్ల బజారు, గార్లపేట రోడ్డులో ఉన్న వార్డు సచివాలయాల్లో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని కమిషనర్ పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ... బిఎల్వోలు అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటర్ల జాబితాలో నమోదయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల ఓట్లను ఇంటి వద్దకు వెళ్లి మ్యాపింగ్ చేయాలని సూచించారు.