ఉరవకొండ: కూటమి ప్రభుత్వ వెన్నుపోటుపై విడపనకల్‌లో వైసిపి కదం తొక్కింది: వైయస్సార్సీపి పీఏసీ సభ్యులు వై. విశ్వేశ్వర రెడ్డి
కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన వెన్నుపోటుకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా అనంతపురం జిల్లా విడపనకల్ మండల కేంద్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ నిరసనకు ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపి పీఏసీ సభ్యులు వై.విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ మండల జిల్లా నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు.'సూపర్ సిక్స్' పేరుతో ప్రజలను నమ్మించి,అధికార పీఠం ఎక్కిన తర్వాత ప్రజలకు ఘోరంగా వెన్నుపోటు పొడిచారన్నారు.