రాప్తాడు: హనీ ట్రాప్ కేసులో వెనక ఉన్న ప్రజాప్రతినిధుల పైన విచారణ చేయాలి అనంతపురంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి
అనంతపురం జిల్లా కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం 12:45 సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాప్తాడు అనంతపురం రూరల్ లో హనీ ట్రాప్ సంఘటనలో ఒక సీఐను మాత్రమే డిస్మిస్ చేయడం జరిగిందని అయితే డిస్మిస్ అయిన సీఐ శ్రీహర్ష పరిటాల సునీత సోదరుడు మురళి తో ఎప్పుడు ఫోన్లో టచ్ లో ఉంటూ ఈ వ్యవహారమంతా వెనక ఉండి చేయడం జరిగిందని అలాంటప్పుడు పరిటాల సునీత సోదరుడు మురళి పై పాత్ర పైన కూడా విచారణ చేయాలని లేదా హనీ ట్రాప్ కేసులు సిపిఐ తో విచారణ చేయాలని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.