కనిగిరి: ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కనిగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నాం: ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి పట్టణంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై విజయోత్సవ సభను కనిగిరి ఎమ్మెల్యే మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... కనిగిరి నియోజకవర్గం లో గతంలో ఎవరు చేయని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వంలో చేపట్టడం జరిగిందన్నారు. వైసీపీని రాజకీయంగానే ఎదుర్కోవాలని అందుకు టిడిపి శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.