గిద్దలూరు: రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలో పెద్దపులి మృతి చెందిన ఘటనపై విచారణ వేగవంతం చేసిన అధికారులు
మార్కాపురం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులి మృతి చెందిన ఘటనపై అటవీ మరియు పోలీస్ అధికారులు విచారణ వేగవంతం చేశారు. అయితే పెద్దపులి మృతి చెందిన తీరు అనుమానస్పదంగా ఉండటంతో ఇప్పటికే పోస్టుమార్టం పూర్తి చేసి పులికి అంత్యక్రియలు పూర్తి చేశారు. నివేదిక కోసం అధికారులు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఇప్పటికే అనుమానితులను అదుపులోకి తీసుకున్న అధికారులు విచారిస్తున్నారు. డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు ఇప్పటికే పోలీసు అటవీశాఖ అధికారులు కలిసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.