సంతనూతలపాడు: కొచ్చర్లకోట అంగన్వాడి పాఠశాలలో ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పిల్లల పాఠశాల సంసిద్ధతపై తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం
మద్దిపాడు మండలంలోని కొచ్చర్లకోట అంగన్వాడి పాఠశాలలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో సోమవారం పిల్లల పాఠశాల సంసిద్ధతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు మాట్లాడుతూ.... మూడేళ్లు పైబడిన చిన్నారులకు అంగన్వాడి పాఠశాలలో ప్రీస్కూల్ విద్యను ప్రారంభించడం జరుగుతుందన్నారు. మూడేళ్లు పైబడిన పిల్లలను అంగన్వాడి పాఠశాలల్లో చచ్చేందుకు విద్యార్థులు తల్లిదండ్రులు చొరవ చూపాలన్నారు. అంగన్వాడీల ద్వారా విద్యార్థులకు అందించే పౌష్టికాహారం వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఎదిగేందుకు బాటలు వేస్తుందన్నారు. అనంతరం గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు.