సంతనూతలపాడు: మద్దిపాడు లో టిడిపి వర్చువల్ గా నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభించిన సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్
మద్దిపాడు క్లస్టర్ లో వర్చువల్ గా నిర్వహిస్తున్న టిడిపి మహానాడు కార్యక్రమాన్ని సంతనూతలపాడు శాసనసభ్యులు బి ఎన్ విజయ్ కుమార్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే విజయ్ కుమార్ మాట్లాడారు. మహానాడు కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు 28వ తేదీ గురువారం ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం ఘనంగా జరుగుతుందని, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు.