ఉరవకొండ: నరసాపురం వద్ద ప్రధాన రహదారిపై కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో వ్యక్తి దుర్మరణం
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం బెలుగుప్ప మండల పరిధిలోని నరసాపురం గ్రామ సమీపంలో ప్రధాన రహదారిపై సోమవారం సాయంత్రం కారు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో రాయదుర్గంకు చెందిన లడ్డు ఇస్మాయిల్,(60) మృతి చెందాడు. కారులో రాయదుర్గం నుండి ఇస్మాయిల్ తో పాటు డ్రైవర్ రామచంద్ర మరో ఇద్దరు కుటుంబ సభ్యులతో కలిసి వస్తుండగా నరసాపురం వద్ద కారు బోల్తా పది నుజు నుజ్జు అయ్యింది. ఘటనలో ఒకరి మృతి చెందగా డ్రైవర్ కు రక్త గాయాలు మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి 108 వాహనంలో తరలించి చికిత్సలు అందిస్తున్నారు.