కనిగిరి: పామూరు పట్టణంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని పరిశీలించిన కనిగిరి ఏఎంసీ చైర్మన్ రమా శ్రీనివాస్
పామూరు పట్టణంలో ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని కనిగిరి ఏఎంసీ చైర్మన్ రమా శ్రీనివాస్ గురువారం పరిశీలించారు. ఇంతవరకు పామూరు పట్టణంలో ఎంత శాతం ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ జరిగిందో అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. అర్హత గల ప్రతి ఒకరికి ఓటు హక్కు కల్పించాలని, వారందరి పేర్లు జాబితాలో ఉండే విధంగా చూడాలని బిఎల్ఓ లకు ఏం సి చైర్మన్ సూచించారు. అదేవిధంగా వలస ఓటర్లను గుర్తించి, వారిని కూడా రప్పించి వారి ఓట్లు హోటల్లో జాబితాలో గల్లంతు కాకుండా చూడాలని కోరారు.